ఉద్యోగుల పాలిట శాపామాయే సి పి యస్ విధానం

ప్రభుత్వ  ఉపాధ్యాయులు   సెప్టెంబర్ 1న   చీకటి  దినం  గా పాటించాలి
టి సి పి యస్ ఈ ఏ…పసుల శంకర్
మాహాదేవపూర్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి)
మాహాదేవపూర్ మండల కేంద్రంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో 01.09.2004 తర్వాత ఉద్యోగములో చేరిన ఉద్యోగ,ఉపాధ్యాయులందరికీ కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ . సి పి యస్ అనే నూతన పింఛను విధానం అమలు పరుస్తున్నారు.దీనివల్ల భవిష్యత్తులో  పదవి విరమణ అనంతరం పింఛను  350 రూపాయలు కంటే తక్కువ వచ్చే అవకాశం ఉన్నదని .నేడు మన రాష్ట్రంలో ఆసరా పింఛను 2016 రూపాయలు ఉన్న ముప్పైయైదు సంవత్సరాలు సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 350 పింఛను రావడం చాలా  బాధాకరమని  ఉద్యోగులు విమర్శించారు. కొత్త పింఛను విధానం అమలులోకి వచ్చిన దినమైన సెప్టెంబరు 1ని చీకటి దినంగా భావించి గురువారం రోజున  ఉద్యోగ ,ఉపాధ్యాయులు స్థానిక మండల వనరుల కేంద్రం మహదేవ్ పూర్ ప్రాంగణం యందు నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో  సి పి యస్   కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియచేయడం జరిగిందని  ఉపాధ్యాయులు శంకర్  పేర్కొన్నారు .తదనంతరం పాఠశాలల సముదాయము ప్రధానోపాధ్యాయులు  ఆకుల. అశోక్ కు వినతి పత్రం అందించడం జరుగిందని  టి సి పి యస్ ఈ ఏ. ప్రధాన కార్యదర్శి పసుల శంకర్ పేర్కొన్నారు ఈ  కార్యక్రమములో ,జిల్లా ప్రధాన కార్యదర్శి  జయశంకర్ భూపాల్ పల్లి ,శ్రీ కురుసం.అశోక్ అధ్యక్షులు టి సి పి సి యస్  ఈ ఏ  మహదేవ్ పూర్ కుమార స్వామి, శ్యామ్,శ్రీపాల్,సునీత,స్రవంతి, లీలరాణి,సర్వత్ సుల్తానా,పూర్ణిమ,సతీష్,తిరుపతి  ఉద్యోగులు మరియు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జిల్లా, మండల బాధ్యులు  తదితరులు పాల్గొన్నారు