మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పన్నా నుంచి ఛత్తర్‌పూర్ వెళ్తున్న బస్సు పసరి వద్ద చెట్టును ఢికొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సు పరిమితికి మించి ప్రయాణీకులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.



