రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ఉదయంపూట నిర్వహించాలి

` మండుటెండల నేపథ్యంలో అధికారులచిT సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి):మండుటెండల కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2న పేరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకలను ఉదయం 8.30కే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు అవతరణ ఉత్సవ కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వేడుకలకు హాజరయ్యే అతిథులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.