షర్మిళ ఏ హోదాతో పాదయాత్ర చేపడుతారు: శోభాహైమావతి

హైదరాబాద్‌: దొచుకొటానికి రాష్ట్రంలో ఇంకా ఏం మిగిలిందని షర్మిళ పాదయాత్ర చేపడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళాధ్యక్షురాలు శోభా హైమావతి ప్రశ్నించారు. 2003లో వైఎస్‌ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ గనులు, భూములు, సంపద ఉన్నాయో పరిశీలించి అధికారంలోకి రాగానే వాటిని దోచేశారని ఆరోపించారు. తండ్రి, కొడుకులు కలసి రూ. లక్ష కోట్ల ప్రజా సొత్తును భోంచేశారన్నారు. షర్మిళ ఏ హోదాతో పాదయాత్ర చేపడతారని, ఏ హోదాలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని నిలదీశారు. పిల్ల కాంగ్రెస్‌లో షర్మిళ పదవి ఏంటని ప్రశ్నించారు.