షిండే రెండు రాష్ట్రాలన్నాడు

కాదని నిరూపిస్తే తల నరుక్కుంటా..
మీరు ముక్కు నేలకి రాస్తారా : నారాయణ సవాల్‌
హైదరాబాద్‌, జనవరి 17(జనంసాక్షి) :
రెండు రాష్టాల్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని అఖిలపక్ష సమావేశంలో ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పష్టం చేశారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ తెలిపారు. ఆయన అలా చెప్పలేదని నిరూపిస్తే తాను తల తీసేసుకుంటానని, అలా అనలేదని చెబుతున్న వారు దాన్ని నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాస్తారా? అని సవాలు విసిరారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ స్పష్టం చేయగా, వైఎస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పకుండా నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలిపెట్టగా, టీడీపీ విభజన వైపే మొగ్గు చూపిందనినారాయణ చెప్పారు. ఇక, కాంగ్రెస్‌ కూడా తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగానే మాట్లాడిందన్నారు. రెండు రాష్టాల్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని అఖిలపక్ష సమావేశంలో ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పష్టం చేశారన్నారు. ఆయన అలా చెప్పలేదని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి నిరూపిస్తే తన తల తీసేసుకుంటానని, అలా నిరూపించని పక్షంలో ఆయన ముక్కు నేలకు రాస్తారా? అని సవాలు విసిరారు. తెలంగాణకు సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత అడ్డుకొనే యత్నాలు చేయడం సరికాదని సీమాంధ్ర నేతలకు సూచించారు. ఏళ్ల తరబడి ప్రసవ వేదనతో బాధ పడుతున్న తెలంగాణకు సుఖ ప్రసవం జరిగేలా సహకరించాలని కోరారు. టీడీపీ నెతలు కొందరు తోక జాడిస్తున్నారని, వారిని అదుపులో పెట్టాలని చంద్రబాబుకు సూచించారు.