Thursday, 5 November 2026

అంకంపాలెం పాఠశాలను సందర్శించిన అకడమిక్ ప్యానల్ బృందం

అంకంపాలెం పాఠశాలను సందర్శించిన అకడమిక్ ప్యానల్ బృందం
అశ్వారావుపేట, జనవరి 12, (జనంసాక్షి )
దమ్మ పేట మండలం అంకం పాలెం ఆశ్రమ ఉన్నత పాఠశాల ను గురువారం నాడు సందర్శించిన అకడమిక్ ప్యానల్ బృందం పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే విద్య మరియు వసతి కార్యక్రమాలను నిర్వహణ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల లో సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ మెడికల్ రూం డైనింగ్ హాల్ కిచెన్ షెడ్ గేమ్స్ రూం మినరల్ వాటర్ ప్లాంట్ హరితహరం శానిటేషన్ నిర్వహణను పరిశీలించి హెచ్ ఎం మరియు వార్డెన్ ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో అకడమిక్ ప్యానల్ బృందం లీడర్ జి భద్రు హెచ్ఎం. వేంకటేశ్వర్లు వార్డెన్ భవాని ఉపాధ్యాయులు నగేష్ భీమా రమణ శ్యామల వెంకట రమణ నాగేంద్ర సంధ్యారాణి అనూష కృష్ణ ప్రసాద్ రామక్రిష్ణ రత్న సురేష్ శ్రీను వీరభద్రo లత రవి వాణి గోపాలరావు దేవి పాంచాలి సునీత పుష్ప లలిత తదితరులు పాల్గొన్నారు.