Thursday, 5 November 2026

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలి

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలి

జెడ్పి సీఈవో విజయనాయక్

ఇటిక్యాల (జనంసాక్షి) జనవరి 12 విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను సైతం వెలికి తీసే విధంగా విద్యాబోధన చేయాలని జడ్పీ సీఈవో విజయ నాయక్ అన్నారు. మండల పరిధిలోని ఆర్ గార్లపాడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను గురువారం జిల్లా పరిషత్ కార్య నిర్వహణ అధికారి విజయనాయకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా మన ఊరు మనబడి పనులను ప్రధానోపాధ్యాయులుతో కలిసి పరిశీలించారు. మన ఊరు మనబడి ప్రణాళి పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చేయించాలన్నారు. అనంతరం పాఠశాలల్లోని విద్యార్థులను పుస్తక పఠనం చేయించి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టిక, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవ, స్థానిక ఎంపిటిసి మల్లేష్, పంచాయతీ సెక్రటరీ భాష, ప్రధానోపాధ్యాయులు ఖరేందర్, ధనుంజయ్, కురుమూర్తి, విద్యాకమిటీ చైర్మన్ ఇస్మాయిల్ మరియు గ్రామస్తులు ఉన్నారు.