అంగన్వాడి కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
వేములవాడ, ఆగస్టు 26 (జనంసాక్షి): వేములవాడ పట్టణంలోని పదవ వార్డు ఎంపీపీ ఎస్ గాంధీనగర్ పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రంలో ఓటర్ల నమోదు వివరాలను బిఎల్ఓ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రంను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. చిన్నారులకు, గర్భిణీలకు అందిస్తున్న పోషకాహారం, పిల్లల వయసుకు తగ్గ ఎదుగుదల వివరాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్ధ్యాలు పరీక్షించి అంగన్వాడీ టీచర్ జ్యోతిని అభినందించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్ డి ఓ మధుసూదన్, అర్బన్ తహశీల్దార్ మహేష్ తదితరులు ఉన్నారు.