అంగన్వాడి సెంటర్లో అంబేద్కర్ వర్ధంతి
వరంగల్ ఈస్ట్, డిసెంబర్ 06(జనం సాక్షి)
42వ డివిజన్ మాల వాడ లో అంగన్వాడీ సెంటర్ నందు బాబా సాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ కార్పొరేటర్ కేడల పద్మ హాజరై ఆ మహానుభావునికి పూల మాల వేసి శ్రద్ధాంజలి గటించారు. ఈ కార్య క్రమానికి డివిజన్ ముఖ్య నాయకులు, మహిళలు, అంగన్వాడీ సిబ్బంది, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..




