Thursday, 5 November 2026

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొండమల్లేపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కొండమల్లేపల్లి డిసెంబర్ 6 జనం సాక్షి న్యూస్ : భారత రాజ్యాంగ నిర్మాత,దళిత,గిరిజన,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది.
-సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిది చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం
డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుచుకుంటూ తెలంగాణను అభివృద్ధి పథంలో దేశానికే ఆదర్శం దేవరకొండ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
భారత రాజ్యాంగ నిర్మాత,దళిత,గిరిజన,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దేవరకొండ శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం కొండమల్లెపల్లి పట్టణంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భారత రాజ్యాంగ శిల్పి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు,సంఘసంస్కర్త, మహామేధావి, న్యాయశాస్త్రవేత్త,అంబేద్కర్ అని ఆయన కొనియాడారు.నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది అని ఆయన అన్నారు.సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిది అని ఆయన అన్నారు.చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరే గారు అని ఆయన తెలిపారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం కావడం జరిగింది అని ఆయన అన్నారు.డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుచుకుంటూ తెలంగాణను అభివృద్ధి పథంలో దేశానికే ఆదర్శం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు రమావత్ దసృ నాయక్,పసునూరి యుగేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ గంధం సురేష్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ కుమార్, లాలు నాయక్, టిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తూలిసిరామ్,వస్కుల శ్రీను,ముడవత్ పాండు, వంకూనవత్ బిక్కు,రావుల వెంకటయ్య, సత్యనారాయణ, బాలు నాయక్,శంకర్ నాయక్,సర్దార్, సమతా సైనిక్ దళ్ సభ్యులు తరులు పాల్గొన్నారు