Tuesday, 3 November 2026

నిధులన్నీ కేంద్రానివే.సబ్కా సాత్ సబ్కా వికాస్ బిజెపి నినాదం  మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి

 

 

 

భూపాలపల్లి ఏప్రిల్ 29 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కేటాయించే నిధులు అన్ని కేంద్రాన్నివేనని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. శనివారం బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగంధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలందరినీ కలుపుకుపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులను కేటాయించడం లేదని అసత్యపు ఆరోపణలు చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడి ప్రైమరీ హెల్త్ సెంటర్లకు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నారని వివరించారు. కేంద్రం సింగరేణి కార్మికుల కోసం 1680 కోట్లను కేటాయించిందని పేర్కొన్నారు. సింగరేణి ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందంటూ టిఆర్ఎస్ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తుందన్నారు. పండిత్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా స్కూల్ ఫర్ రైజింగ్ పథకం పేరట 14500 కోట్ల రూపాయలను కేటాయించారని వివరించారు. మేరకు జయశంకర్ జిల్లాలోని ఆరు స్కూళ్లకు గాను 9 కోట్లను కేటాయించారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ఏమైందని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రకటించినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదని, విద్యార్థుల సౌకర్యం కోసం పక్కా భవనాలు లేకుండా అరకురా వసతులతో కాలేజీని ప్రారంభిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. జిల్లా కేటాయించిన మెడికల్ కాలేజీ తో పాటు వంద పడకల ఆసుపత్రికి కేంద్రం నిధులు వస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. పీఎం నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా దేశ ప్రజలతో మమేకమయ్యే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని ప్రజలందరూ చూసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ చేపట్టిన మణికీ బాత్ కార్యక్రమం ప్రపంచంలోనే గొప్పగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొంగల రాజేందర్, ఎరుకల గణపతి, మధుసూదన్ రెడ్డి, నిశీధర్ రెడ్డి, వేషాల సత్యవతి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.