Saturday, 7 November 2026

అంగన్వాడీ నూతన ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు స్వీకరించిన మేడి మాధవి

అంగన్వాడీ నూతన ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు స్వీకరించిన మేడి మాధవి

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 19 (జనంసాక్షి) పల్లెర్ల ఎస్సి కాలనీ లో ఉన్న అంగన్వాడీ నూతన ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు స్వీకరించిన మేడి మాధవి ఆమె మాట్లాడుతూ పిల్లలకు ఉన్నత విద్య ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందిస్తానని అన్నారు జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన అంగన్వాడీ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యలను నెరవేర్చాలని మాతా శిశు రక్షణ సంరక్షణ కోసం ప్రభుత్వ అంగన్వాడీల ద్వారా అందించే సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించాలన్నారు అనంతరం నూతన ఉపాధ్యాయురాలికి సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి ఎంపీటీసీ సోలిపురం మల్లరెడ్డి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మేడి రామలక్ష్మయ్య యాదిరెడ్డి మేడి స్వామి సుగుణ నరేష్ పాపయ్య అంగన్వాడీ ఆయా పిల్లలు తదితరులు పాల్గొన్నారు