Saturday, 7 November 2026

కొండమల్లేపల్లి పట్టణంలో హెల్త్ కేర్ మెడికల్ షాప్

కొండమల్లేపల్లి పట్టణంలో హెల్త్ కేర్ మెడికల్ షాప్ నూతనంగా ప్రారంభించిన జడ్పిటిసి సలహాదరు పసునూరు యుగేందర్ రెడ్డి కొండమల్లేపల్లి డిసెంబర్ 19 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని స్థానిక పట్టణంలో గల చౌరస్తాలో సోమవారం నాడు జెడ్పిటీసి సలహాదారు పసునూరు యుగేంధర్ రెడ్డి చేతుల మీదుగా హెల్త్ కేర్ మెడికల్ దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు.అనంతరం అయన మాట్లాడుతూ పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు అవసరమయ్యే అందుబాటులో ఉండే ,నాణ్యమైన మందులు సరళమైన ధరలకే అందించాలని వినియోగదారులతో సక్రమంగా ఉండాలని, ఆరోగ్యానికి అవసరమయ్యే మందులు మాత్రమే ఇవ్వాలని డాక్టర్ రాసి ఇచ్చిన చీటి పై మాత్రమే మందులు ఇవ్వాలని డాక్టర్ అనుమతి లేకుండా సొంతంగా ఎలాంటి మందులు కూడా ఇవ్వకూడదని నిర్వాహకులకు సూచించారు ప్రతి కొనుగోలు పై డిస్కౌంట్ ఇవ్వడం,ఉచిత హోమ్ డెలివరీ సదుపాయం కల్పించడం పై దుకాణ యాజమాన్యాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అంజి,ఉప సర్పంచ్ యేకుల సురేష్,విద్యార్థి నాయకులు ఎం.డి ఖధీర్,కృష్ణ గౌడ్,స్థానికులు పాల్గొన్నారు.