Sunday, 8 November 2026

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మండల పడిపూజ

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మండల పడిపూజ
*పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 26, జనంసాక్షి :
జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి మండల పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా, చూడముచ్చటగా ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు. గురుస్వాములు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో మొదట వివిధ రకాల పూల అలంకరణతో వివిధ రకాల పూల అలంకరణతో గణపతి పూజ, లక్ష్మీదేవి పూజ, కుమారస్వామి పూజ, శ్రీ అయ్యప్ప స్వామి పూజ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పదునెట్టబడి మెట్లకు ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు నవగ్రహ పూజ, స్వామి వారికి పలు రకాల పండ్ల రసాలతో నేయ్యభిషేకం ఘనంగా నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి అయ్యప్ప స్వామి పడిపూజ లో పాల్గొని పలు రకాల పూజలు నిర్వహించారు ఈ పూజలో భాగంగా గురుస్వాములు, కన్నెస్వాములు ,కత్తి స్వాములు, గంట స్వాములు, గధ స్వాములు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప నామ భజనలు భక్తి పాటలతో, అటలతో, నృత్యాలతో భక్తి భావముతో ఆకట్టుకున్నారు. పూజ తదానంతరం తీర్థ ప్రసాద వితరణ అనంతరం స్వాములకు బిక్ష ,భక్తులకు అన్నదానం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో 3000 మంది భక్తులు పాల్గొన్నారు