సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి సర్వాయి పాపన్న.
-ఎక్సైజ్, క్రీడలు శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్.
-సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి, శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీపీ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్26(జనంసాక్షి)
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,శాసన మండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ లతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే బీరు హర్షవర్థన్ రెడ్డి, ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ లు మాట్లాడుతూ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి “సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్” ప్రతీక అని అన్నారు.సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచి,ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని అన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుంద ని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




