Sunday, 8 November 2026

మృతుని కుటుంబానికి పరామర్శించి, ఆర్థిక సాయం చేసిన

మృతుని కుటుంబానికి పరామర్శించి,
ఆర్థిక సాయం చేసిన
-డోర్నకల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి_మలోతు నెహ్రూ నాయక్

కురవి డిసెంబర్26:జనం సాక్షి న్యూస్:కురవి మండలం
నల్లెల గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు అవుల సందీప్ చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి శవంగా మారి ఇంటికి వచ్చాడు. ఆదివారం హైదరాబాద్ బైక్ యాక్సిడెంట్లో మృతి చెందాడు. శవాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ బాధ్యులు నెహ్రూ నాయక్ బాధ్యత కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. మృతుని కుటుంబానికి అన్నివేళలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.వారి వెంట సిరోల్ మండల బాధితులు జరిపోతుల రంగన్న గౌడ్, ఎడ్ల వెంకన్న, డోర్నకల్ మండల నాయకులు భానోత్ శ్రీను, అనంతుల ఉపేందర్ గౌడ్, సాదు నాయక్,రాందాస్ నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.