మోమిన్ పేట మే 06 జనం సాక్షిమోమిన్ పేట మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామంలో కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో కామ రతి శ్రీశ్రీశ్రీ బీరప్ప మహంకాళి జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభమైంది ఈ జాతర మహోత్సవంలో ఎల్లమ్మ బోనాలు బీరప్ప గుడి మలలు బీరప్ప లింగా లు తీసుకురావడం తో జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో గొల్ల కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజశేఖర్ యాదవ్ బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు 7న మల్లన్న బోనాలు అన్నదానం బీరప్ప బోనాలు 8న చుక్క బోనం బి కామరతి బీరప్ప కళ్యాణం అన్నదానం యాటలు గావు పట్టుట కార్యక్రమాలు ఉంటాయన్నారు 9న కామా రతి బీరప్ప నాగవెల్లి వెళ్ళుట ఈనెల 10 నాడు గడప లు కడుగుట తో జాతర కార్యక్రమం ముగిస్తుందని గ్రామ సర్పంచ్ రాజశేఖర్ యాదవ్ గ్రామ బి ఆర్ఎస్ అధ్యక్షుడు మల్లేశం యాదవ్ తెలిపారు జాతర మహోత్సవాలకు వివిధ గ్రామాల ప్రజలు కురుమ యాదవ సంఘం డోల్ దెబ్బ వివిధ అనుబంధ సంఘాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు సూచించారు




