మోమిన్ పేట మే 08 (జనం సాక్షి)వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట మండలంలో నీ మల్లారెడ్డిగూడెం గ్రామంలో కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో కామ రతి శ్రీశ్రీశ్రీ బీరప్ప మహంకాళి జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ జాతర మహోత్సవంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలని సూచించారు ఎల్లమ్మ బోనాలు బీరప్ప గుడి మలలు బీరప్ప లింగా లు తీసుకురావడం తో జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో గొల్ల కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజశేఖర్ యాదవ్ బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు సోమవారం చుక్క బోనం బి కామరతి బీరప్ప కళ్యాణం అన్నదానం యాటలు గావు పట్టుట కార్యక్రమాలు ఉంటాయన్నారు 9న కామా రతి బీరప్ప నాగవెల్లి వెళ్ళుట ఈనెల 10 నాడు గడప లు కడుగుట తో జాతర కార్యక్రమం ముగిస్తుందని వారు తెలిపారు జాతర మహోత్సవాలకు వివిధ గ్రామాల ప్రజలు కురుమ యాదవ సంఘం డోల్ దెబ్బ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజశేఖర్ ఎంపీటీసీ బ్రహ్మానంద రెడ్డి మాజీ ఎంపీటీసీ జానకి బి ఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశం యాదవ్ పిఎసిఎస్ డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి దళిత రత్న అవార్డు గ్రహీత బిచ్చయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు




