జనం సాక్షి, చెన్నారావుపేటమండలం లోని ఎం.ఆర్.సి కార్యాలయంలో మన ఊరు మన బడి అభివృద్ధి పనులు జరుగుచున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కు మండల నోడల్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ ప్రత్యేక సమావేశంను ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి అభివృద్ధి పనులు ఈ నెల చివరి వరకు తప్పకుండా పూర్తి చేయాలని తెలిపారు.బడి బాట కార్యక్రమంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని,మన ఊరు మన బడి అభివృద్ధి పనుల ఫోటోలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ ఆఫీసర్ ఫ్లోరెన్స్, ప్రధానోపాధ్యాయులు, ఎం.ఆర్.సి సిబ్బంది సీఆర్పీ పాల్గొన్నారు.




