Wednesday, 4 November 2026

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

 

 

 

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, మే 8 (జనం సాక్షి);ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు, తహశిల్దార్ లను ఆదేశించారు.
సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ద్వారా 86 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో ఆసరా పెన్షన్ కు సంబంధించి 3 , భూ సమస్యల పై 78, భూ సర్వే కు సంబంధించి 3, ఇతర సమస్యలపై 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని దరఖాస్తులు పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి మీ సేవలో సక్సేషన్ కింద దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తుదారుడికి వివరించారు. పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించి ఆయా మండలాల తహశిల్దార్ లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో లో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఆర్డిఓ రాములు , ఏ ఓ యాదగిరి , సూపరిండెంట్ రాజు ,మదన్ మోహన్ ,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.