అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 31, జనంసాక్షి :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి స్వగృహములో గోదాదేవి, రంగనాయకుల కళ్యాణం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా, చూడముచ్చటగా ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో కోరుట్ల మెట్పల్లి లోని భక్తులు, ఆత్మీయ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . గురువులు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో మొదట వివిధ రకాల పూల అలంకరణతో గణపతి పూజ, నవగ్రహ పూజ,లక్ష్మీదేవి పూజ పంచామృత అభిషేకాలు పలు రకాల పండ్ల రసాలతో నేయ్యభిషేకం,పలు రకాల పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రంగనాయకుల గోదాదేవి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా భక్తులు, ఆత్మీయ బంధువులు భక్తి నినాదాలతో, భజనలతో, భక్తి పాటలతో, అటలతో, నృత్యాలతో భక్తి భావముతో ఆకట్టుకున్నారు. పూజ తదానంతరం తీర్థ ప్రసాద వితరణ అనంతరం ,భక్తులకు, ఆత్మీయ బంధువులకు అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో, గన్నారం నరసింహాచారి, తిప్పర్తి వెంకటేష్, శ్రీరాములు, బాజోజి సురేష్, ఇల్లెందుల శ్రీనివాస్, రమేష్ ,రామానుజం, తిరుమల్, మారోజు సురేష్ , కృష్ణమాచారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం




