న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం పై శిక్షణ కార్యక్రమం
మల్దకల్ డిసెంబర్ 31(జనం సాక్షి)మల్డకల్ ప్రాజెక్ట్ పరిధిలోని మల్డకల్, గట్టు,
ఐజ మండలాల అంగన్వాడి టీచర్లకున్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం కొత్త మొబైల్ యాప్ గురించి రిఫ్రెషర్ ట్రైనింగ్ శనివారము నిర్వహించారు.జనవరి నెలనుంచి అన్నీ అంగన్వాడి కేంద్రాలలో అందించే సేవలు అన్ని ఆన్లైన్లో పారదర్శకంగా నమోదు చేయాలని చెప్పడం జరిగింది.ఈయాప్,లో రోజూ వారి పిల్లల హజరు,రోజువారీ ప్రీ స్కూల్ కార్యక్రమాలు,పెరుగుదల పర్యవేక్షణ నమోదు,సరుకుల నిల్వల వివరాలు,పోషణ ట్రాకర్, లబ్ధిదారుల వివరాలు, నెలవారి
రిపోర్ట్లులు వంటి సమాచారం ఆన్లైన్ ఆధారంగా పొందుపరచడం జరుగుతుంది. ప్రతీ అంగన్వాడి టీచర్ పై వివరములు అన్నీ సమ యనుసారంగా కచ్చితత్వమ్ ఉండేలా నమోదు
చేయవలసిఉంటుంది అని శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమంలో
పోషన్ అభియాన్ జిల్లా కో ఆర్డనేటర్ కళ్యాణ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి,సూపర్వైజర్ లు,నాగరాణి,బాలమ్మ, జయప్రద,వాసంతి,తెల్లమ్మా, పాల్గొన్నారు.




