Tuesday, 3 November 2026

వికలాంగులకు వీల్ చైర్లు, దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్

వికలాంగులకు వీల్ చైర్లు, దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్
హసన్పర్తి మండలంలోని గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ చింతగట్టులో దత్త సాయి నిర్మయ మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికలాంగులకు వీల్ చైర్లు, దుప్పట్లు, బియ్యం పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగులకు 3వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీరుపేదలకు విద్యార్థులు, నిరుద్యోగులు, క్రీడాకారుల కోసం కార్యక్రమాలు చెప్పటినట్లు తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయం నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు నిత్యావసర సరుకులతో ఆర్థిక సహాయాన్ని సైతం అందజేసినట్లు తెలిపారు. వర్దన్నపేట నియోజకవర్గంలో త్వరలోనే వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దత్త సాయి నిర్మయ మనోవికాస కేంద్రం ఫౌండర్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు గుగులోత్ దివ్య రాణి- రాజు నాయక్, సిరంగి సునీల్ కుమార్,శ్రీనివాస్, పీఎసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి, వైస్ చైర్మన్ మల్ల రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ ఎరుకొండ శ్రీనివాస్,గ్రామ శాఖ అద్యక్షుడు యువరాజ్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.