అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాథుని కళ్యాణ మహోత్సవం
మెట్పల్లి టౌన్, జనవరి 11,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని
బోయవాడలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం రోజున గోదాదేవి రంగనాథుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ గా చూడముచ్చటగా ఘనంగా జరిగింది,లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రోహర్ హేమ చందర్, శ్రీపతి, రవి దంపతులు గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు, వేద పండితులు పురోహితులు వేదమంత్రాల తో ఘనంగా గోదాదేవి కళ్యాణం జరిగింది,ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పర్మి నరసయ్య .ఆర్మూర్ నరేందర్ మగ్గడి సురేష్, మహాజన్ శివకుమార్ ,వాల్గోట్ పురుషోత్తం , మర్రి భాస్కర్,తోపారపు రాజేందర్, బ్రహ్మయ్య, మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాథుని కళ్యాణ మహోత్సవం




