యాదాద్రి భువనగిరి జిల్లా
(జనం సాక్షి)
“సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి నూతన కాలమానంను ఆవిష్కరించిన ఆర్డిఒ భూపాల్ రెడ్డి..
భువనగిరి పట్టణంలో బుధవారం రోజున సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి కాలమానమును జిల్లా కలెక్టరేట్ లో భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ..సమాచార హక్కు చట్టం అందరికీ అందుబాటులో ఉంటుందని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అని వారు పేర్కొన్నారు. సమాచార హక్కు సేవలు జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి తెలిసేలా 2005 సమాచార హక్కు చట్టం బోర్డును ఏర్పాటు చేయాలని సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బద్దం భూపాల్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు నల్లమాస కుమార్ గౌడ్,గౌ సలహాదారులు కురాం కోశాలు, ప్రధాన కార్యదర్శి బల్లారి బాల నరసింహ, ఉపాధ్యక్షులు బుగ్గ శ్రీనివాస్, కోశాధికారి పులగం జంగారెడ్డి, భువనగిరి నియోజకవర్గ కన్వీనర్ గాదె శేఖర్, సహాయ కార్యదర్శి దాసరి లక్ష్మయ్య,కార్యవర్గ కార్యదర్శి బోయపల్లి రాజశేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు మర్రి ప్రకాష్ రెడ్డి, కాటం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.




