అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం
పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు
మెట్ పల్లి టౌన్, జనవరి12,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని కోదండ రామాలయం దేవస్థానంలో గురువారం రోజున ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా దేవి రంగనాయకుల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా చూడముచ్చటగా ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు, పురోహితులు రమాకాంత్ చారి, మూర్తి శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల సాక్షిగా అత్యంత వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం జరిగింది, ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే తిరుప్పావై కి చెందిన పాశురాలను భక్తులతో కలిసి మనసంతానం చేస్తారు గురువారం రోజున పాశురాలను అత్యంత వైభవంగా భక్తులు మహిళలు అనుసంధానం చేశారు ఆలయానికి హాజరైన భక్తులందరూ గురువారం రోజున అమ్మవారికి విశేషమైన హారతులతో భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు కళ్యాణం అనంతరం అమ్మవారికి సారే ఓడి బియ్యం వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు తదానంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, అనంతరం అన్నదానం నిర్వహించిన మాలెపు రాములు దంపతులు, ఈ అన్నదాన కార్యక్రమంలో 1000 మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు మహజన్ నర్సింలు, మహజన్ శివకుమార్ , సుతారి అంజయ్య ,ఆర్మూర్ పోచయ్య ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ చారి ,జగదీశ్వర్, ప్రవీణ్ రావు ,రాములు, సుతారి బుచ్చి రాజ్యం, వెంకటేష్, సురేష్ పలువురు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం పాల్గొన్న ఎమ్మెల్యే




