Thursday, 5 November 2026

భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుడు

భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుడు
– కెమిలాయిడ్స్ మేనేజర్ సుబ్రహ్మణ్యం

అశ్వారావుపేట,జనవరి 12 (జనంసాక్షి)

వివేనానందుడు భారతీయ సంస్కృతి హిందూ మతం యొక్క వైవిధ్యమైన వారసత్వాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసారని కెమిలాయిడ్స్ ఫ్యాక్టరీ మేనేజర్ సుబ్రహ్మణ్యం అన్నారు. నిస్వార్థ ప్రేమ దేశం పట్ల అంకిత భావం కలిగి ఉండాలన్న ఆయన భోధనలను నేటి యువత ఆచరించాలన్నారు. అశ్వరావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి 160వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన సిపిఎం పార్టీ నాయకులు, వి కే డి ఎస్ రాజు కాలేజీ ప్రిన్సిపల్ వెలుగోడు శేషుబాబు మాట్లాడుతూ స్వామి బోధనలు మనలోని ఆత్మ శక్తిని గ్రహించేలా చేశాయన్నారు.వివేకానందుడిని ప్రపంచ ఆధ్యాత్మిక నాయకులలో ఒకరిగా గౌరవించుకుంటూ జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.రామకృష్ణ పరమహంస ని కలిసే వరకు వివేకానందుని ఆధ్యాత్మిక అన్వేషణకు సమాధానం దొరకలేదని తదుపరి పూర్తి తత్వవేత్తగా అవతరించారని శేషు బాబు వివరించారు.ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ చీమకుర్తి సుబ్బారావు, విద్యార్థిని విద్యార్థులు పలువురు తదితరులు పాల్గొన్నారు.