వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
మిర్యాలగూడ. జనం సాక్షి.
వాసవి వనిత క్లబ్ మిర్యాలగూడ,వాసవి వనిత క్లబ్ కుసుమాంబ ల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో సంక్రాంతి సందర్భంగా మహిళలందరికీ సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించామని వనిత క్లబ్ రీజినల్ చైర్మన్ రాయపూడి భవాని తెలిపారు.
ఈ ముగ్గుల పోటీలకు బహుమతులను ప్రియా గోల్డ్ ఆయిల్స్ సంస్థ అందించగా ఈ పోటీలలో 75 మంది మహిళలు పాల్గొన్నారని వారికి మొదటి బహుమతిగా 10 లీటర్ల ప్రియా గోల్డ్ ఆయిల్,
రెండవ బహుమతిగా ఐదు లీటర్ల ప్రియా గోల్డ్ ఆయిల్, మూడవ బహుమతిగా మూడు లీటర్ల ప్రియా గోల్డ్ ఆయిల్, ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులు గా రెండు లీటర్ల ప్రియా గోల్డ్ ఆయిల్, పాల్గొన్న ప్రతి ఒక్కరికి వన్ లీటర్ ప్రియా గోల్డ్ ఆయిల్ బహుకరించారు మరియు ఇంకో ఇద్దరికి ప్రత్యేక బహుమతులుగా వన్ లీటర్ ప్రియా గోల్డ్ ఆయిల్ మరియు హ్యాండ్ బ్యాగ్ బహుకరించారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితలుగా డాక్టర్ భవాని ,డాక్టర్ నమ్రతా రెడ్డి ,మరియు శారద శ్రీనివాసులు వ్యవహరించారు. ముఖ్యఅతిథిగా
ప్రియా గోల్డ్ ఆయిల్స్ సేల్స్ మేనేజర్ నరసింహ ,ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి కన్నె గుండ్ల రంగయ్య , కమిటీ సభ్యులు రాయపూడి ఉమా శేఖర్ ,క్లబ్ ప్రెసిడెంట్ కే రమాదేవి, జి అనిత, కార్యదర్శిలు గుండా లక్ష్మి, కోశాధికారి ఉష బాల, రీజినల్ సెక్రెటరీ పద్మావతి ,మహిళా సభ్యులు పద్మ, శ్రీదేవి ,విమల తదితరులు పాల్గొన్నారు
వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు




