Wednesday, 4 November 2026

అంగరంగ వైభవంగా శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి కళ్యాణోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి కళ్యాణోత్సవం
ఝరాసంగం నవంబర్ 7( జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. కార్తీక మాసం పురస్కరించుకొని ఈ వేడుకలను ప్రతి ఏడాది మాదిరిగానే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చి పార్వతీ సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకుని కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షించి తరించారు. భక్తిశ్రద్ధలతో కార్తీకదీపం వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఆలయం మూసివేయబడుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేశం గుప్తా, మండల్ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్, ఆలయ ఈవో శశిధర్, ఎంపీడీవో సుజాత, మాజీ అధ్యక్షులు సంగమేశ్వర్ పాటిల్ ధర్మకర్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.