Wednesday, 4 November 2026

రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతా

రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతా
– పట్టణ ప్రగతితోనే పట్టణాలు అభివృద్ధి
– హుజూర్ నగర్ మున్సిపాలిటీనీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నవంబర్ 7 (జనం సాక్షి): రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి సహాయ, సహకారాలతో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతానని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం గాంధీ పార్కు సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మునుగోడు ప్రజల తీర్పు బిజెపి పార్టీకి బుద్ధి తెచ్చేలా ఉందని అన్నారు. వ్యక్తి ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా అంటే అభివృద్ధి వైపే ప్రజలు చూశారన్నారు. పట్టణ ప్రగతితో పట్టణాలు అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఉప ఎన్నికలు వచ్చిన తర్వాతనే హుజూర్ నగర్ లో అభివృద్ధి పరుగులు పెట్టిందని తెలిపారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీనీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంత గాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు ఓరుగంటి నాగేశ్వరరావు, మంగమ్మ, కుంట సైదులు, సోమ గాని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.