నిధులు ఉన్న ధాన్యం కొనుగోళ్ళలో జాప్యమేల? సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాకం బాలస్వామి
పానుగల్ నవంబర్ 07,జనంసాక్షి
కొనుగోళ్లకు తగినన్ని నిధులు ప్రభుత్వ బ్యాంక్ ఖాతాలో జమ చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్వయంగా ప్రకటించారని, మరి వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం ఎందుకు చేస్తున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తెల్ల రాళ్లపల్లి ఉప సర్పంచ్ కాకం బాలస్వామి అన్నారు.సోమవారం మండలంలోని పానుగల్ ,తెల్లరాళ్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్ యార్డులో నవంబర్ 5వ మంత్రి హరీష్ రావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారని తెలిపారు.అక్కడ కొనుగోలు మొదలవగా ఇక్కడి రైతులకు ఈ శిక్ష ఏమిటని విమర్శించారు జిల్లాలో 255 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసినట్లు పౌరసరఫరాల అధికారి కొండలరావు 15 రోజుల క్రితమే ప్రకటించారని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ లను సిపిఐ జిల్లా సమితి, జిల్లా రైతు సంఘం (ఏఐకేఎస్) ప్రతినిధి బృందం కలిసి కేంద్రాలను వెంటనే ప్రారంభించి ప్రతి గింజ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసిందని తెలిపారు కానీ వారం రోజులు కావస్తున్న కొనుగోలు మొదలు కాలేదని,వారం రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం వస్తున్నదని, కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు ధాన్యంతో నిండిపోయి పోసుకునేందుకు స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చలికాలం కావడంతో కొనుగోలు కేంద్రాల వద్ద చలికి వణుకుతూ రైతులు కాపలా కాస్తున్నారని,వర్షాలు వస్తాయేమోనని భయపడుతున్నారని తెలిపారు వెంటనే కొనుగోలు ప్రారంభించాలాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెల్ల రాళ్లపల్లి సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి సహదేవ్ సభ్యులు శంకరయ్య రాముడు తదితరులు పాల్గొన్నారు.
నిధులు ఉన్న ధాన్యం కొనుగోళ్ళలో జాప్యమేల? సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాకం బాలస్వామి




