మెట్పల్లి, ఏప్రిల్ 24, జనంసాక్షి :మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, వేద పండితులతో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి – గోవిందమాంబ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా,కన్నుల పండుగగా, చూడముచ్చటగా ఘనంగా నిర్వహించారు. తదానంతరం యజ్ఞం పూర్ణహుతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఇల్లెందుల రాజు దంపతులు పాల్గొన్నారు, అనంతరం జరిగిన అన్నదానం కార్యక్రమంలో భక్తులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఇల్లెందుల రాజు, ఉపాధ్యక్షులు పూసల విష్ణు, కార్యదర్శి పూసల శ్రీనివాస్, కోశాధికారి వంగళ భక్తం, మరియు గ్రామ సర్పంచ్ బద్దం సుగుణ – రాజేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఎంపీటీసి సభ్యులు బోగ వందన – గంగాధర్ , వార్డ్ సభ్యులు గ్రామ పెద్దమనుషులు మార్శెట్టి రామాంజనేయులు, డా. బాలరాజం , జైడి చిన్న రెడ్డి , రఘుపతి రెడ్డి, కొమ్ములపెల్లి గణేష్ , మరియు కొండస్వామి భక్తులు & వీరబ్రహ్మేంద్రస్వామి స్వాములు, ఇల్లెందుల కృష్ణమాచారి, బెజ్జారపు మురళి, ఇల్లెందుల శ్రీనివాస్, మెట్పల్లి కళాకారులు భజనలతో భక్తి పాటలతో ఆకట్టుకున్నారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




