బిచ్కుంద ఏప్రిల్ 24 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల హజ్గుల్ గ్రామంలో సోమవారం నాడు సర్పంచ్ ఎడపల్లి మారుతి వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలను తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయంగా చూసి చలించిపోయారని, అందుకే నేడు రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.




