Wednesday, 4 November 2026

అంజనిలో అరుణతార ఇంటింట ప్రచారం

 

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్20, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్ గల్ మండలం అంజనీ గ్రామం , అంజనీ తండాలో గురువారం కామారెడ్డి జిల్లా బిజేపి అద్యక్షురాలు, జుక్కల్ మాజి ఎమ్మెల్యే అరుణతార ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బిజెపి సిద్ధాంతాలను తెలిపారు. ప్రజల యోగక్షేమాలు,సమస్యలు అడిగి తెలుసుకున్నారు.తాను జుక్కల్ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ది వివరించారు.ఈ కార్యక్రమమం లో పెద్ద కొడప్గల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెండ్యాల హాన్మండ్లు, నాయకులు అశోక్ రాజ్, అశోక్ పటేల్, సంజయ్ పటేల్,వడ్ల రాములు,సుభాష్ ,రామాగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.