మిర్యాలగూడ, జనం సాక్షి.మిర్యాలగూడ మండలం బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు పొదిల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) నిర్వహిస్తున్న 2వ విడత హాత్ సే హాత్ జోడో యాత్ర గురువారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. ముల్కలకాలువ గ్రామం నుంచి కొత్తపేట గ్రామానికి పాదయాత్ర చేరుకోగా బిఎల్ఆర్ కు గ్రామాలలో అపూర్వ స్వాగతం లభించింది. బిఎల్ఆర్ కు మహిళలు తిలకం దిద్ది స్వాగతం పలుకుతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండలు మరోవైపు కాంగ్రెస్ నేత బిఎల్ ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందడంతో కాంగ్రెస్ నాయకులు శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, కోరుతున్నారు. డప్పు వాయిద్యాల మధ్య పార్టీ అభిమానులు కార్యకర్తల డ్యాన్సుల జోరు హోరెత్తిస్తుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ లు , జడ్పీటీసీ లు, కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు, బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు .




