టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్. భారీగా కాంగ్రెస్ శ్రేణుల బైక్ ర్యాలీ.
ఊర్కొండ, జనవరి 28 (జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శ్రీ పబ్బతి అభయాంజనేయస్వామి ముగింపు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకునిటీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అధికారులు ఎర్ర శేఖర్ గారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అంతకుముందు ఊర్కొండ మండల కేంద్రం నుండి మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.. అక్కడి నుండి భారీగా బైకు ర్యాలీతో ఊర్కొండపేట అభయుడి ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.




