Tuesday, 3 November 2026

తడి పొడి పద్ధతిలో వరిసాగు చేయాలి

 

 

 

 

ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి*సైదాపూర్ జనం సాక్షి జనవరి 28తడి పొడి పద్ధతిలో వరిసాగు చేయాలని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో పద్మ పాని స్వచ్ఛంద సంస్థ కరీంనగర్ ఆధ్వర్యంలో వరిసాగులో తడి పొడి విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వరిసాగు చేసే రైతులు తడిపోడి విధానం పద్దతి పాటించటం వలన నిటి వినియెగాన్ని తగ్గించవచ్చాన్నారు. అలాగే విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు.తడి పోడి వరిసాగుతో మిథేన్ కాలుష్య కారకం విడుదల తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాయిత రాములు, ఎఈఓ రజిత, క్లస్టర్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి, మండల ఫీల్డ్ కోఆర్డినేటర్ కానుగంటి బిక్షపతి రైతులు పాల్గొన్నారు.