Wednesday, 4 November 2026

అంజలి ఆరోపణలపై స్పందించిన భారతీ

చెన్నై, జనంసాక్షి: సినీ నటి అంజలి చేసిన ఆరోపణలపై ఆమె పిన్ని భారతీదేవి స్పందించింది. అంజలి చేసిన ఆరోపణలన్నీ వాస్తవం కాదని తెలిపారు. అంజలి తన అక్క కూతురు అని, ఆమెకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే దత్తత తీసుకున్నానని స్పష్టం చేశారు. అంజలిని మా అక్క చట్టపూర్వకంగానే దత్తత ఇచ్చిందని చెప్పారు. తన దగ్గరకు వచ్చిన కొత్తలో అంజలి తమతో చాలా ప్రేమగా ఉండేదని పేర్కొన్నారు. ‘షాపింగ్‌మాల్‌’ చిత్రం హిట్టయ్యాక అంజలి ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలిపారు. అంజలిని మందలించానే తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తప్పులు చేయాలని కొట్టలేదు, తిట్టలేదని చెప్పారు. అంజలి పారితోషికం లక్షల్లోనే ఉంది.. కోట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని భారతీదేవి అన్నారు. అంజలి ఇప్పుడు ఎక్కడుందో.. ఎలా ఉందో ఆందోళనగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెనుక ఎవరో ఉన్నారు.. వారెవరో తనకు తెలియదన్నారు. తన ఆస్తినంతా పిన్ని భారతీదేవి లాగేసుకుందని అంజలి ఆరోపించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *