అండర్ 13 బ్యాట్మెంటన్ తెలంగాణ జట్టు మేనేజర్ గా రామకృష్ణ ఎంపిక
రామకృష్ణకు పలువురి అభినందనలు
మిర్యాలగూడ, జనం సాక్షి :
నల్గొండ జిల్లా బ్యాట్మెంటన్ కోచ్ మారబోయిన రామకృష్ణ ను సబ్ జూనియర్ నేషనల్ అండర్ -13 తెలంగాణ రాష్ట్ర జట్టుకు మేనేజర్ గా ఎంపిక చేస్తూ తెలంగాణ బ్యాట్మెంటన్ అసోసియేషన్ శనివారం ప్రకటించినట్లు డి ఎస్ డి ఓ మక్బూల్ అహ్మద్ పేర్కొన్నారు. ఈనెల 19 నుండి 23 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నిర్వహించనున్న సబ్ జూనియర్ నేషనల్ అండర్ -13 బ్యాట్మెంటన్ పోటీలకు రామకృష్ణ మేనేజర్ గా ఎంపీక కావడం నల్గొండ జిల్లా బ్యాట్మెంటన్ క్రీడాకారులకు గర్వకారణం అని పలువురు క్రీడాకారులు పేర్కొన్నారు. మారబోయిన రామకృష్ణ తెలంగాణ జట్టు మేనేజర్ గా రామకృష్ణ ఎంపిక అభినందనీయమని నల్గొండ జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 18 మంది క్రీడాకారులతో సబ్ జూనియర్ నేషనల్ అండర్ -13 బ్యాట్మెంటన్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు పాల్గొనున్నది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుండి క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లా బ్యాట్మెంటన్ కోచ్ రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర బ్యాట్మెంటన్ జట్టు మేనేజర్ గా ఎంపీక కావడం గర్వకారణం అని డిఎస్డిఓ మక్బూల్ అహ్మద్ జిల్లా కోచ్ రామకృష్ణను అభినందించారు. క్లియో స్పోర్ట్స్ ఎండి ఏచూరి శ్రీ హర్ష రాహుల్ తదితరులు రామకృష్ణను అభినందనలు తెలియజేశారు.




