గుర్తు తెలియని జంతువు దాడిలో లేగ దూడలు బలి..
ఊరుకొండ, నవంబర్ 12 (జనంసాక్షి):
గుర్తుతెయని జంతువు దాడి చేయడంతో రెండు లేగ దూడలు బలైన సంఘటన శనివారం ఊరుకొండ మండల పరిధిలోని బొమ్మరాసిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫర్వేజ్ మరియు స్థానికుల కథనం ప్రకారం బొమ్మరాసిపల్లి చెందిన రైతులు నారాయణ గౌడ్, శేఖర్ గౌడ్ లకు చెందిన రెండు లేగ దూడలను తమ వ్యవసాయ పొలాల వద్ద కట్టేసి ఉంచగా శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపిందని తెలిపారు. బాధిత రైతుల సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు తెలిపారు. త్వరలోనే ఆ జంతువును పట్టుకుంటామని పేర్కొన్నారు.
గుర్తు తెలియని జంతువు దాడిలో లేగ దూడలు బలి..




