హైదరాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయకేతనం ఎగురవేస్తుందని భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాఫెల్,నోట్ల రద్దు, జీఎస్‌టీ గురించి ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన స్థాయి మరిచి ఇలాంటి ప్రచారాలు చేయటం మానుకోవాలన్నారు. దేశంలోని ప్రజలు మోదీ అవినీతి లేని పాలనకు మద్దతు పలుకుతుంటే అదిచూసి ఓర్వలేని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ సహా ఇగతా నాలుగు రాష్ట్రాల్లో భాజపా విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు కల్లబొల్లి కబుర్లు చెప్పటం మాని, కాంగ్రెస్‌కు రాహుల్‌ను కాకుండా ఇతర నేతను ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సవాలు చేశారు. భాజాపా ఎప్పుడూ వారసత్వ రాజకీయాలు చేయదని, కాంగ్రెస్ ఇప్పటికైనా వారసత్వపు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.




