Thursday, 5 November 2026

తగ్గుతున్న కూరగాయల సాగు

రియల్‌ వెంచర్లతో సాగుకు దూరంగా రైతులు

ఉల్లి తదితర కూరగాయల ధరలకు రెక్కలు

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మరోమారు ఉల్లి ధరలు ధరలు మండిపోతున్నాయి. టమాటా ధరలు మాత్రం కొచెం అదుపులో ఉన్నాయి. దేశీయ టమాటా 15 నుంచి 20 మధ్యన అమ్ముతున్నారు. ఉల్లి ధరలు అనూహ్యంగా మల్లీ 28 రూపాయలకు పెరిగింది. దీనికితోడు చికెన్‌ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఎన్నికల వేళ చికెన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. అమ్మకాలు కూడా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యులు మార్కెట్‌కు వెళ్లాలంటేనే బెంబేలెత్తి పోతున్నారు. ప్రధానంగా పంటలు పండించే భూముల్లన్నీ రియల్‌ వెంచర్లుగా మారడంతో కూరగాయల సాగు తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల వంద కిలోవిూటర్ల వరకు భూములన్నీ రియల్‌ ప్లాట్లుగా మారాయి. దీనికితోడు వానాకాలం మధ్యలో వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు తగ్గిపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు కూరగాయలను కొనుక్కోలేక పోతున్నారు. రైతు బజార్‌, కూరగాయల మా ర్కెట్లు జనాలతో కిక్కిరిసి పోయేవి. ధరలు పెరగడంతో మార్కెట్‌లో ప్రజలు లేక వెలవెలబోతున్నాయి. వానాకాలం సీజన్‌లో అనుకూలంగా కురిసిన వర్షాలు మధ్యలో ముఖం చాటేశాయి. దీంతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీనికితోడు నగర శివారు భూములను ప్లాట్లుగా చేసి రియల్టర్లు వ్యవసాయాన్ని, కూరగాయల పంటలను దెబ్బతీసారు. హైదరాబాద్‌కు వంద కిలోవిూటర్ల దూరం వరకు ఉన్న భూములన్నీ వెంటచర్లుగా మారాయి. దీంతో రైతులు కూరగాయల సాగును మానేశారు. రానున్న రోజుల్లో ఇది మరింత గడ్డు పరిస్థితులను తేనుందని అంటున్నారు.