డోర్నకల్ ప్రతినిధి మార్చి 23 (జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలో కొమ్ములవoచ శివారు గ్రామ పంచాయతీ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ జటోత్ దేవేందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూఅంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.18 ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేస్తారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు గ్రామంలో ప్రతి ఒక్కరు కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.వైద్యాధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ వెంకన్న, ఉపసర్పంచ్ లక్ష్మి నారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్ ,ఎంపీవో సోమలాల్, బీఆర్ఎస్ నాయకులు ,ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంతత్వం లేని తెలంగాణ ధ్యేయం…అంతత్వం లేని తెలంగాణ ధ్యేయం…కంటి వెలుగు ప్రారంభించిన వైస్ ఎంపీపీ…




