టేకులపల్లి, జనవరి 16( జనం సాక్షి ): అందత్వాన్ని దూరం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 నుండి ప్రారంభమవుతున్న దృశ్యా స్పెషల్ ఆఫీసర్ వేల్పుల విజేత సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మండలంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయడానికి కావలసిన సూచనలు, సలహాలను ఇవ్వడంతోపాటు కార్యక్రమానికి కావాల్సిన సామాగ్రిని పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమం జరిగే గ్రామా పంచాయితీలలో ప్రజలందరికీ తెలిసేలా ఆహ్వాన పత్రికలను రెండు రోజుల ముందుగా ప్రతి ఇంటికి పంపిణీ చేయమని అదే విధంగా డప్పు చాటింపు ద్వారా ప్రచారం చేయాలని, 18 సంవత్సరాలు దాటిన ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునేటట్లు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ దినేష్, కంటి వెలుగు వైద్యాధికారులు శ్రావణి,పావని, సనత్ కుమార్, ఫాతిమా, ముత్యాలంపాడు పంచాయతీ కార్యదర్శి శ్వేత, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగబండి వెంకటేశ్వర్లు, వీసం శకుంతల, ఫార్మసిస్ట్ మంగిలాల్, దివ్య, సతీష్, సునీత లు పాల్గొన్నారు.




