బయం తో బెంబేలెత్తున్న ప్రజలు
ఎల్లారెడ్డి 16 జనవరి (జనం సాక్షి) ఎల్లారెడ్డి మండల కేంద్రం లో గల్లి గల్లి లో గ్రామ సింహాల బెడద రోజు రోజుకు తీవ్రమవుతుంది. కానీ తగ్గడం లేదు. వాటికి పగలు లేదు రాత్రిలేదు. గుంపులు గుంపులుగా జనావాసాల మధ్య తిరుగుతూ పట్టణ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రాత్రిళ్ళు అయితే చాలు నిద్ర పట్టణీయకుండా ఒకే విధం గా మొరగడం వల్ల నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఎంత వరకు సమంజసం . 100 లో మా అంటే 1%, 2% ఉన్న జంతు ప్రేమికుల కోసం పట్టించుకోక పోవడం దారుణం. రోడ్డు పై నుండి బైక్ పై కానీ సైకిల్ పై కానీ వెళ్తుంటే బైక్ ల వెంట పరిగెత్తి మరి కరుస్తున్నాయి కుక్కల గుంపు మరుగుతూ రావడం తో వాహనాల పై వున్న వారు జడుసుకొని వహనాన్ని ఇంకా వెగంగా వెళ్ళడం తో యాక్సిడెంట్లు ఆవుతున్నాయి దాంతో వాహనదారులు ఆసుపత్రి పాలవుతున్నారు ప్రతి పల్లె లో వందలాది గ్రామ సింహాలు తిరుగుతున్నాయి సర్పంచ్ లకు పిర్యాదు ఇస్తే ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు ఇలా ఐతే ఎలా అని అంటున్నారు ఒకప్పుడు గ్రామ పంచాయతీ లేక మున్సిఫల్ అధికారులు వచ్చి వాటిని పట్టి ఇంజక్షనో లేక మాంసంలో మందు కలిపి ఇచ్చి చంపెవారు ఇంకా ఇతర పద్దతులు పాటించి సంతానం పెరుగ కుండా అడ్డుకునేవారు. ఇప్పుడైతే అసలు వాటి జోలికి పోవడం లేదు. రోజు రోజుకు వాటి ఆగడాలు మితి మీరి పోతున్నాయి. మనుషులను కరవడం ,మేకలను కోల్ల ను కొరికి తింటున్నయి మరియు చిన్న పిల్లలను పీక్క తిన్న సందర్భాలు ఎన్నో మనం చూసే ఉంటాము.ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో విధి. విధి లో కుక్కల బెడద ప్రజలు బయంకంపితులైతున్నరు రాత్రిళ్ళు అయితే చాలు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రోద్దంత కష్టపడి బుక్కెడు తిని కంటినిండా నిద్ర పోదాం అంటే నిద్రే లేకుండా చేస్తున్నాయి. సంబంధిత అధికారులు కలుగ చేసుకొని వాటిని పట్టి బయట వదిలి పెట్టడమో లేక సంతానం పేరుగ కుండా చూడడమో చేయవలసిందిగా పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు. గతం లో కూడా ఇదే విధం గా కోతుల బెడద కూడా బాగానే ఉండే. దానికి మున్సిఫల్ ఛైర్మన్ కమిషనర్ లు కలుగ జేసుకొని కోతులు పట్టె వారిని పిలిచి పట్టణ ప్రజలకు ఉప శమనం కలిగించారు. సక్సెస్ అయ్యారు. అదే విధం గా వీటికి అనగా గ్రామసింహాలకు కూడా ఎదో ఒక విధం గా పరిష్కారం చూపుతారని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.




