Thursday, 5 November 2026

లారీ బోల్తాపడింది.. పెనుప్రమాదం తప్పింది.

నెరడిగొండజనవరి16(జనంసాక్షి):మండల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద నిర్మల్ వైపు వెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటన సోమవారం రోజునచోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెంగుళూరు నుంచి ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తున్న ఏపీ21టీజడ్ 5579 నంబర్ గల లారీ బ్రేకు ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనాలను తప్పించబోవు క్రమంలో లారీ అదుపు తప్పి బోల్తాపడిందని వాహన చోదకుడికి సహాయ క్లినర్ లకు ఎలాంటి గాయాలు కాలేదు.ఇట్టి పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు టోల్ ప్లాజా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.