అలంపూర్ మే24 (జనంసాక్షి)
అలంపూర్ చౌరస్తా సమీపంలో రాయచూర్ వెళ్లే రహదారి పైన మంగళవారం సాయంత్రం వీచిన గాలివానకు రోడ్డు అంచున ఉండే 11కేవి విద్యుత్ స్తంభం విరిగి నడి రోడ్డు మేర వాలిపోయి ఉంది.బుధవారం మధ్యాహ్నం అయిన కూత వేటు దూరంలో ఏడీఏ కార్యాలయం ఉన్న ఇప్పటివరకు అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఏమాత్రం పొరపాటు జరిగిన రోడ్డున వెళ్ళే వాహనాలకు, ప్రయాణికులకు విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉంది. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి స్తంబాలు సరిచేయాలని ప్రయాణికుల కోరుతున్నారు..
అంతరాష్ట్ర రహదారిపై వాలిపోయిన విద్యుత్ స్తంభం




