Monday, 16 November 2026

అంతర్జాతీయ చిత్రకారుడికి ప్రముఖుల నివాళి

సిద్దిపేట టౌన్‌: అంతర్జాతీయ చిత్రకారుడు డాక్టర్‌ కాపు రాజయ్య మృతితో మెదక్‌ జిల్లా సిద్దిపేట శోక సంద్రంలో  మునిగిపోయింది. ఎమ్మేల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, తెలంగాణ ధూంధాం పేమ్‌ రసమయ బాలకృష్ణ, భాజపా రాష్ట్ర నేత వంగ రాంచంద్రారెడ్డి, ఆర్డీవో నిఖిల ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. పురప్రజలు, ప్రముఖులు, వివిధ ప్రాంతాల నుంచి కళాభిమానులు తరలిస్తూ రాజయ్యకు నివాళిలు అర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *