Thursday, 5 November 2026

అంతర్జాతీయ మహిళల హింస వివక్ష నిర్మూలనకు కృషి

అంతర్జాతీయ మహిళల హింస వివక్ష నిర్మూలనకు కృషి చేయాలి…..వనపర్తి టౌన్ : డిసెంబర్ 8 ( జనం సాక్షి) నవంబర్ 25 నుండి డిసెంబర్ 10వ. తేది వరకు నిర్వహిస్తున్న, అంతర్జాతీయ మహిళల హింస, వివక్ష నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని పుష్పలత ఆదేశించారు.గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖఆధ్వర్యంలో ” అంతర్జాతీయ మహిళ హింసకు, వివక్ష నిర్మూలన” పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,నవంబర్ 25వ. తేది నుండి డిసెంబర్ 10వ. తేది వరకు 15 రోజుల పాటు అంతర్జాతీయ మహిళా హింసకు వ్యతిరేక పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళల వెట్టి చాకిరీ వ్యవస్థను రూపుమాపాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైన ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఆమె అన్నారు. పిల్లల పెంపకంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ధైర్యంగా నిలబడి పోరాటం చేసిన స్త్రీ మూర్తులను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అన్నారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి. ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ మగవారితో సమానంగా స్త్రీలకు గౌరవం అందేలా మగ పిల్లలను తయారు పెంచాలని ఆయన అన్నారు. మహిళలు వేధింపులకు, హింసకు గురైనప్పుడు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, షి టీమ్ ద్వారా రక్షణ పొంది సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. వేధింపులు జరిగిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతారని,ఆయన తెలిపారు. మహిళా ఎస్సై ఆధ్వర్యంలో మహిళలకు వచ్చే వేధింపులు హింసపై విచారణ జరిపి న్యాయం చేస్తారని ఆయన తెలిపారు. వనపర్తిలో సఖికేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నదని ఆయన తెలిపారు. మహిళలు చాలా శక్తివంతులని ఆయన అన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని ఆయన సూచించారు. పిల్లలను క్రమ శిక్షణతో పెంచాలని, అలా వినని పక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించాలని, సరైన మార్గంలో నదిచినప్పుడే భావి పౌరులుగా ఎదుగుతారు అని ఆయన తెలిపారు. లింగ వివక్ష చూపరాదని ఆయన అన్నారు. చాలా స్పూర్తితో అవగాహనతో , మాట్లాడిన కార్తీక అనే 6వ. తరగతి చదివే బాలికను ఆయన అభినందించారు. సఖి కేంద్రం ద్వారా 1324 కేసులు నమోదు కాగా, 1139 కేసులు పరిష్కార మయ్యాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సమస్యలను పరిష్కరిస్తున్న సఖి కేంద్రం నిర్వాహకులను, డి.డబ్ల్యు ఓ, పుష్పలత, చెన్నమ్మ థామస్ లను ఆయన అభినందించారు.
సి. డబ్ల్యూ.సి. చైర్మన్ అలివెలమ్మ మాట్లాడుతూ మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి. ఈ. ఓ. రవీందర్, సి. డబ్ల్యూ.సి. ఆలివెలమ్మ, చెన్నమ్మ థామస్, డి.ఎం.హెచ్. ఓ రవి శంకర్, సఖి నిర్వాహకులు, సఖి కేంద్రం సిబ్బంది మహిళా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.