Tuesday, 3 November 2026

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన పసిడి ధర

ముంబయి, జనంసాక్షి: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతోంది. ఔన్స్‌ బంగారం ధర 16 డాలర్ల దాకా నష్టపోతూ 1431 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ బాగా బలపడటం వల్ల ధర తగ్గుతోంది. ప్రస్తుతం డాలర్‌ ఇండెక్స్‌ 83.3కు సమీపంలో ట్రేడవుతోంది. డాలర్‌ బలపడటం వల్ల మన రూపాయి నష్టపోతోంది. సోమవారం 18 పైసల దాకా కోల్పోతూ 55రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. డాలర్‌ బలం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతుంటే రూపాయి బలహీనత వల్ల మన మార్కెట్లో బంగారం ధర అంతగా తగ్గడం లేదు. ఈ ఉదయం ఎంసీక్స్‌లో 10 గ్రాముల ధర 200 రూపాయల దాకా నష్టపోతూ 26,800 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. ఆర్నమెంట్‌ బంగారం ధర 24 క్యారెట్ల కంటే కనీసం 1000 రూపాయలు తక్కవ ఉండాలి. అంటే 25,800లు ఉండాలి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొంటున్న వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *